బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 10:17:32

కరోనా ప్రభావం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు రద్దు

కరోనా ప్రభావం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు రద్దు

హైదరాబాద్‌ : బెంగళూరులో తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల నిర్వహణ తలపెట్టింది. కాగా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్‌ మీటింగ్‌లపై కర్ణాటక ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగళూరులో రేపు ప్రారంభం కానున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సంఘ్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తెలిపారు. 


logo
>>>>>>