గురువారం 21 జనవరి 2021
National - Dec 19, 2020 , 17:34:25

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య కన్నుమూత

ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య కన్నుమూత

నాగ్‌పూర్‌ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)  సిద్ధాంతకర్త ఎంజీ వైద్య (97) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగ్‌పూర్‌లోని స్పందనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను నాగ్‌పూర్‌లోని అంబజరీ ఘాట్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త కార్యదర్శి  డాక్టర్‌ మన్‌మోహన్‌ వైద్య తెలిపారు.

తొమ్మిది దశాబ్దాలుగా సంఘ్‌ సేవక్‌కు ఎంజీ వైద్యకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మృతికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది సంఘ్‌ చాలక్‌లతో కలిసి పనిచేయడం ఎంజీ వైద్యకు దక్కిన అదృష్టమని గడ్కరీ పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్టుగా, శాసనమండలి సభ్యుడిగా, సంస్కృత స్కాలర్‌గా,  ఆర్‌ఎస్‌ఎస్‌ మొట్టమొదటి అధికార ప్రతినిధిగా ఎంజీ వైద్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo