శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 13, 2021 , 22:02:12

తమిళనాడులో మోహన్‌ భగవత్‌ పర్యటన

తమిళనాడులో మోహన్‌ భగవత్‌ పర్యటన

చెన్నై: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తమిళనాడుకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం చెన్నైలోని మూలకాడై సమీపంలో సామూహిక పొంగల్ వేడుకల్లో పాల్గొంటారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రెండు రోజుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo