గురువారం 04 జూన్ 2020
National - May 15, 2020 , 18:00:49

రూ.90 ల‌క్ష‌ల విలువైన గుట్కా సీజ్

రూ.90 ల‌క్ష‌ల విలువైన గుట్కా సీజ్

ముంబై: మ‌హారాష్ట్ర పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఔరంగాబాద్ లో గురువారం రాత్రి ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టిన పోలీసులు..ట్ర‌క్కులో ఉన్న 300 బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నారు. జ‌ల్టా ఫాటా స‌మీపంలో షోలాపూర్‌-ఔరంగాబాద్ రోడ్‌పై ఇద్ద‌రి ద‌గ్గ‌ర రూ.90 ల‌క్ష‌ల విలువైన డ్ర‌గ్స్ సీజ్ చేసిన‌ట్లు ఛిక‌ల్తానా పోలీస్ స్టేష‌న్ అధికారి తెలిపారు. గుట్కా త‌ర‌లిస్తున్న ట్ర‌‌క్కు డ్రైవ‌ర్ సయ్య‌ద్ తోపాటు షేక్ ర‌ఫీక్  బుల్ధానా గ్రామానికి చెందినవారు. గుట్కా త‌ర‌లింపు ఘ‌ట‌న‌లో అతికుర్ రెహ్మాన్ అనే మ‌రో వ్య‌క్తికి కూడా ప్ర‌మేయముంద‌ని, త్వ‌ర‌లోనే అత‌న్ని ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo