శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 20:44:48

కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద వాహనంలో రూ.8.5 లక్షలు స్వాధీనం

కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద వాహనంలో రూ.8.5 లక్షలు స్వాధీనం

పాట్నా: బీహార్‌లోని పాట్నాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న వాహనం నుంచి రూ.8.5 లక్షల నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ కార్యాలయానికి నోటీస్‌ జారీ చేశారు. మరోవైపు ఆ వాహనం పార్టీ కార్యాలయం బయట ఉన్నదని బీహార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ శక్తిసిన్హా గోహిల్ తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రాంగణం నుంచి ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సహకరిస్తామని అన్నారు. రాక్సాల్‌లో బీజేపీ అభ్యర్థి నుంచి 22 కేజీల బంగారం, 2.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఐటీ అధికారులు అక్కడకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను రాజకీయ పార్టీలు ముమ్మరం చేస్తున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.