సోమవారం 30 మార్చి 2020
National - Feb 23, 2020 , 17:29:25

ఢిల్లీలో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్‌..

ఢిల్లీలో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్‌..

న్యూఢిల్లీ:  ఢిల్లీ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు భారీ మొత్తంలో మత్తపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా..ఇద్దరు మహిళల దగ్గర 10 కిలోల హెరాయిన్‌ను సీజ్‌ చేసినట్లు ఎన్‌సీబీ ఢిల్లీ జోన్‌ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా తెలిపారు. మొజాంబిక్‌ దేశానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు ఇచ్చిన సమాచారంతో అధికారులు ఐవరీ కోస్ట్‌కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.  ఈ ముగ్గురు నిందితుల నుంచి అధికారులు మొత్తం 14.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ విలువ రూ.60 కోట్లుందని అంచనా.  అప్ఘానిస్తాన్‌లో తయారు చేసిన హెరాయిన్‌గా సాధారణంగా మొజాంబిక్‌కు పంపించిన తర్వాత అక్కడి ప్రపంచంలోని పశ్చిమదేశాలకు రవాణా చేస్తుంటారు.  అయితే ఈ కేసులో మాత్రం హెరాయిన్‌ను మొజాంబిక్‌కు వచ్చిన తర్వాత భారత్‌ కు రవాణా చేస్తున్నారని  మల్హోత్రా వెల్లడించారు. 


logo