సోమవారం 01 జూన్ 2020
National - May 13, 2020 , 21:22:13

పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి 3,100 కోట్లు విడుదల

పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి 3,100 కోట్లు విడుదల

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకొనేందుకు విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన పీఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్ట్‌ నుంచి రూ.3,100 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు విరాళాలు అందుకోవడానికిగాను ప్రధాని నరేంద్ర మోదీ  'పీఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్ట్‌'ను నెలకొల్పారు. గత 50 రోజులుగా ఈ ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. కాగా, ఈ మొత్తంలో నుంచి రూ.3,100 కోట్లను విడుదల చేసి.. రూ.2,000 కోట్లతో 50 వేల వెంటిలేటర్లు కొనుగోలు, రూ.1,000 కోట్లతో వలస కార్మికుల సంక్షేమం, రూ.100 కోట్లతో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ ట్రస్ట్‌ను మార్చి 27న ప్రారంభించగా.. ట్రస్ట్‌ సభ్యులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నిర్మలాసీతారామన్‌ ఉన్నారు.


logo