బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 08, 2020 , 02:30:44

రూ.225కే వ్యాక్సిన్‌

రూ.225కే వ్యాక్సిన్‌

  • భారత్‌తోపాటు మధ్యాదాయ దేశాలకు  
  • 2021లో 10 కోట్ల డోసులు సరఫరా
  • గావి, బిల్‌-మిలిండాగేట్స్‌ సహకారం
  •  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: కరోనాకు కేవలం రూ.225కే వ్యాక్సిన్‌ సరఫరా చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) ప్రకటించింది. వ్యాక్సిన్‌కు ప్రభుత్వాల అనుమతి రాగానే భారత్‌తోపాటు మధ్య ఆదాయ దేశాలకు 10కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని తెలిపింది. గావి, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్ల సహకారంతో తక్కువ ధరకే వ్యాక్సిన్‌ సరఫరా చేస్తామని శుక్రవారం పేర్కొంది. ‘కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటు ధరలో కేవలం మూడు డాలర్ల (రూ.225) కే అందివ్వాలని నిర్ణయించాం. ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్‌ వ్యాక్సిన్లు డబ్ల్యూహెచ్‌వో తదితర అనుమతులను పొందగానే వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలుపెడుతాం. వ్యా క్సిన్‌ తయారీకోసం బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తన వ్యూహాత్మక పెట్టుబడి నిధి ద్వారా 150 మిలియన్‌ డాలర్లు అందిస్తున్నది. వ్యాక్సిన్‌ ఉత్పత్తికోసం గావి, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌తో కూడిన అంతర్జాతీయ సమాఖ్యతో మేము కూడా కలువటం సంతోషంగా ఉంది. భారత్‌తోపాటు మధ్యాదాయా దేశాలకోసం 2021లో 10కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తాం’ అని వెల్లడించింది. ఎస్‌ఐఐ ప్రకటనను ఐసీఎమ్మార్‌ డైరెక్టర్‌ జనరల్‌ భార్గవ స్వాగతించారు.


logo