శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 19:58:45

విజయవాడ అగ్ని ప్రమాద మృతులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా : కేంద్రం

విజయవాడ అగ్ని ప్రమాద మృతులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా : కేంద్రం

అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం విజయవాడలోని కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు పీఎంఓ ఆదివారం ట్వీట్‌ చేసింది. ఈ ఘటనపై ప్రధాని "విజయవాడలోని కొవిడ్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఆవేదనకు గురిచేసింది. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డితో చర్చించానని, అన్ని విధాలా సహకరిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా విజయవాడ హోటల్ అగ్ని ప్రమాదంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఆదివారం ఉదయం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణ ప్యాలెస్, రమేశ్‌ హాస్పిటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ తహసీల్దార్‌, ఇన్సిడెంట్ కమాండర్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మరణించిన 10 మందిలో తొమ్మిది మంది ఊపిరి పీల్చలేక మరణించగా ఒక మహిళ పూర్తిగా కాలిపోయి మరణించిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. నరేశ్‌ వెల్లడించారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo