శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 17:59:04

పశుసంవర్ధకశాఖ అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు

పశుసంవర్ధకశాఖ అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు

ఢిల్లీ : పశుసంవర్ధకశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ-3లో భాగంగా నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. పాల సేకరణ రంగం ప్రస్తుతం దేశంలో సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించినట్లు తెలిపారు. పాల సేకరణ ద్వారా పాడి రైతులకు రూ. 4,100 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. 2 కోట్ల మంది పాడిరైతులకు రూ. 5 వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు అందజేసినట్లు తెలిపారు. ఈ రంగానికి ప్రోత్సహకంగా సహకార రంగాల్లోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో 53 కోట్ల వరకు పాడి పశువులు ఉన్నట్లు అంచనా అన్నారు. ఇప్పటికే దేశంలో 1.5 కోట్ల ఆవులు, గేదెలకు జియో ట్యాగింగ్‌ చేసినట్లు తెలిపారు. పశువులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితరాలకు 100 శాతం వాక్సినేషన్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు.


logo