గురువారం 04 జూన్ 2020
National - May 23, 2020 , 15:28:53

కానిస్టేబుల్‌ భార్యకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం

కానిస్టేబుల్‌ భార్యకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం

డెహ్రూడూన్‌: ఉత్తరాఖండ్‌లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ సంజయ్‌ గుర్జార్‌ భార్యకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఉత్తరాఖండ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆ మొత్తాన్ని సమకూర్చారు. శనివారం మధ్యాహ్నం కానిస్టేబుల్‌ సంజయ్‌ గుర్జార్‌ భార్య ఉత్తరాఖండ్‌ సీఎం కార్యాలయానికి వెళ్లి సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ చేతులమీదుగా రూ.10 లక్షల చెక్‌ను అందుకున్నారు. 

అంతేగాక సంజయ్‌ గుర్జార్ భార్యకు వీలైనంత తొందరగా పోలీస్‌ శాఖలో ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ డెహ్రూడూన్‌ డీఐజీని ఆదేశించారు. కాగా కానిస్టేబుల్‌ సంజయ్‌ గుర్జార్‌ ఈ నెల 5న విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కరోనా కట్టడికి ఉపయోపగడే పీపీఈ కిట్లను తీసుకుకొస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 


logo