బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 13:02:22

జర్నలిస్టు విక్రమ్‌ జోషి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

జర్నలిస్టు విక్రమ్‌ జోషి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

గజియాబాద్‌ : జులై 20 సోమవారం దుండగుల దాడిలో మరణించిన జర్నలిస్టు విక్రమ్‌ జోషి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు గజియాబాద్‌ కలెక్టర్‌ అజయ్‌శంకర్‌ పాండే బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది చాలా బాధాకర విషయమన్నారు. జర్నలిస్టు మృతికిసీఎం యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించినట్లు తెలిపారు. తాము విక్రమ్‌ జోషి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. రూ.10లక్షలు తక్షణ సాయంగా అందజేసి విక్రమ్‌ భార్యకు తగిన ఉద్యోగం కల్పిస్తామని, విక్రమ్‌ కూతుళ్లను మంచి పాఠశాలలో చదివిస్తామని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

గజియాబాద్‌ ఎస్పీ కళానిధి నైతాని మాట్లాడుతూ జర్నలిస్టు విక్రమ్‌ జోషి హత్య విషయమై సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. 9 మంది నిందితులను అరెస్టు చేశామని, ప్రధాన నిందితులైన రవి, చోటులను కూడా అదుపులోకి తీసకున్నట్లు తెలిపారు. ఈ హత్యకు రవి ప్లాన్‌ చేయగా చోటు విక్రమ్‌పై కాల్పులు జరిపాడన్నారు. వారి వద్దనున్న పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకొని వారికి ఎలాంటి హానీ జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. logo