సోమవారం 13 జూలై 2020
National - Jun 27, 2020 , 16:48:54

ప్ర‌తిభ చూపిన వారికి ల‌క్ష న‌గ‌దు, ల్యాప్‌టాప్‌: యూపీ‌

ప్ర‌తిభ చూపిన వారికి ల‌క్ష న‌గ‌దు, ల్యాప్‌టాప్‌: యూపీ‌

  • 10వ‌, 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు యూపీ స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆ రాష్ట్రంలో నిర్వ‌హించిన 10వ, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఈ ఫ‌లితాల వెల్ల‌డి కోసం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి దినేశ్ శ‌ర్మ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాధ్యామిక్ శిక్షా ప‌రిష‌త్ అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం దినేశ్ శ‌ర్మ‌..  ప‌రీక్ష‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థులకు రూ.ల‌క్ష న‌గ‌దుతోపాటు, ల్యాప్‌టాప్‌లను ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులుగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచ‌న మేర‌కే తాము ప్ర‌తిభావంతులైన విద్యార్థుల‌కు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించామ‌ని యూపీ డిప్యూటీ సీఎం చెప్పారు. విద్యార్థుల‌కు ల‌క్ష రూపాయ‌లు, ల్యాప్‌టాప్ అంద‌జేయ‌డ‌మేగాక, గ్రామంలోగానీ, ప‌ట్ట‌ణంలోగానీ వారి ఇంటివ‌ర‌కు ప‌క్కా రోడ్డును నిర్మిస్తామ‌ని తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ యూపీ మాధ్య‌మిక్ శిక్షా ప‌రిష‌ద్ స‌మ‌ర్థంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు.   


     


logo