బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 21:55:04

రూ.కోటి 80 లక్షల విలువైన గంజాయి సీజ్‌

రూ.కోటి 80 లక్షల విలువైన గంజాయి సీజ్‌

మహారాష్ట్ర: పూణే కస్టమ్స్‌ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూణేలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను తనిఖీ చేయగా 868 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. గంజాయి ధర బహిరంగమార్కెట్‌లో రూ.1.04 కోట్లుంటుందని అంచనా. మరో వాహనంలో 7.5 కిలోల ఇతర మత్తుపదార్థాలను సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.

నార్కోటిక్‌ డ్రగ్స్‌తోపాటు రెండు వాహనాలను సీజ్‌ చేశాం. పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  
logo