గురువారం 26 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 16:26:55

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి.. ఆనందంతో పార్టీ నేతల డాన్సులు

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి.. ఆనందంతో పార్టీ నేతల డాన్సులు

ముంబై: కేంద్ర మంత్రి, ఆర్పీఐ చీఫ్‌ రామ్‌దాస్ అథవాలే కరోనా నుంచి కోలుకున్నారు. అక్టోబర్‌ 27న ఆయనకు కరోనా సోకగా ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందారు. పది రోజుల అనంతరం కరోనా నుంచి కోలుకున్న రామ్‌దాస్‌ అథవాలే ఆదివారం దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్పీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు రామ్‌దాస్‌ ఇంటి వద్ద సంబురాలు జరుపుకున్నారు. డప్పులు వాయించి డ్యాన్సులు చేశారు. తమ పార్టీ అధినేత రామ్‌దాస్‌ కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.