గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 18:36:53

ప్రయాణికులకు టీ, బిస్కెట్లు అందించిన ఆర్‌పీఎఫ్‌..

ప్రయాణికులకు టీ, బిస్కెట్లు అందించిన ఆర్‌పీఎఫ్‌..

పశ్చిమ బెంగాల్‌: ఆర్‌పీఎఫ్‌(రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) బృందం.. 375 మంది ప్రయాణీకులకు చాయ్‌, బిస్కెట్లు పంపిణీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌లో ఈ సన్నివేశం కనిపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు రద్దు చేసిన విషయం తెలిసిందే.  ప్రజా రవాణా కూడా రద్దు కావడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, హౌరా రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్ల రాకపోకలు బంద్‌ కావడంతో వారు అక్కడే నిరీక్షించారు. 

ప్రయాణికుల పరిస్థితిని గమనించిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు చాయ్‌, బిస్కెట్లు అందించి.. వారికి ఉపశమనం కలిగించారు. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఇషాక్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. logo