ఆదివారం 24 జనవరి 2021
National - Jan 10, 2021 , 10:38:35

రైల్లో నుంచి పడిన మహిళ.. కాపాడిన పోలీసులు.. వీడియో

రైల్లో నుంచి పడిన మహిళ.. కాపాడిన పోలీసులు.. వీడియో

థానే: సమయ స్ఫూర్తితో చాకచక్యంగా వ్యవరించిన ఇద్దరు పోలీసులు ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. కదులుతున్న రైలు నుంచి దిగడానికి ఓ మహిళ ప్రయత్నించింది. అయితే ఆమె పట్టు కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య పడిపోతుండగా, గమనించిన ఇద్దరు పోలీసులు ఆమెను బయటకు లాగేశారు. దీంతో చిన్నపాటి గాయాలతో బతికి బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో నిన్న జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  

శనివారం ఉదయం 10.42 గంటలకు థానే రైల్వేస్టేషన్‌లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి మహానగరి ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్తున్నది. అయితే ప్లాట్‌ఫామ్‌పై ఆగకముందే ధన్‌పాట్టి రాజు భరద్వాజ్‌ అనే మహిళ రైలులోనుంచి దిగడానికి ప్రయత్నించింది. అయితే పట్టుకోల్పోయి కిందపడింది. దీనిని గమనించిన సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ నితిన్‌ పాటిల్‌, ఏఎస్‌ఐ సత్తార్‌ షేఖ్‌ ఆమెను ప్లాట్‌ఫామ్‌కు, బోగీలమధ్య పడిపోకుండా క్షణాల్లోనే పక్కకు లాగేశారు. దీంతో ఆమె ఊపిరిపీల్చుకుంది. ఇదంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. కాగా, బాధితురాలి భర్త రాజు భరద్వాజ్‌ తన భార్యను కాపాడినందకు పోలీసులకు ధన్యావాదాలు తెలిపారు. 

ఇలాంటి ఘటనే కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు తన భార్యతో కలిసి రన్నింగ్‌ ట్రెయిన్‌ నుంచి దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారు కిందపడిపోతుండగా గమనించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ వారిని రైలులోకి తోసేశాడు.  logo