సోమవారం 25 జనవరి 2021
National - Dec 30, 2020 , 17:38:32

రోబో డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

రోబో డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌ :  అమెరికాలోని ప్రముఖ రోబోటిక్‌ డిజైన్‌ సంస్థ బోస్టన్‌ డైనమిక్స్‌ విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నది. నూతన సంవత్సరం స్వాగతం పలికేందుకు ఆ సంస్థ తన రోబోలను ఓ చోట చేర్చి డ్యాన్స్‌ చేయించింది. ఈ ప్రయత్నంలో ‘డూయూ లవ్‌ మీ’ అనే పాటకు అట్లాస్‌ హ్యూమనాయిడ్‌ రోబోలు, రోబో డాగ్‌ సంగీతానికి అనుగుణంగా అద్భుతంగా డ్యాన్స్‌ చేశాయి.

బాణీలకు అనుగుణంగా రోబోలు కాళ్లు, చేతులు కదుపుతూ.. వంగుతూ, ఎగురుతూ ప్రొఫెషనల్‌ కొరియోగ్రాఫర్లకు ఏ మాత్రం  తీసిపోకుండా డ్యాన్స్‌ చేశాయి. రెండు నిమిషాల 53 సెకన్ల నిడిపి గల ఈ సరదా వీడియోను ఆ సంస్థ మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్‌ అవుతున్నది. ట్విట్టర్లో ఇప్పటికే ఈ వీడియోను సుమారు 1.1 మిలియన్ల మంది వీక్షించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థ సీఈఓ ఎలోన్‌ మస్క్‌ సైతం తన అధికారిక ట్విటర్‌ హ్యండిల్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo