సోమవారం 30 మార్చి 2020
National - Feb 17, 2020 , 17:17:57

గ‌న్‌పాయింట్‌లో బెదిరించి.. 30 కేజీల బంగారం దోచుకెళ్లారు

గ‌న్‌పాయింట్‌లో బెదిరించి.. 30 కేజీల బంగారం దోచుకెళ్లారు

హైద‌రాబాద్‌:  చండీఘ‌డ్‌లో భారీ దోపిడీ జ‌రిగింది.  గ‌న్‌పాయింట్‌లో 30 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.  లూథియానాలోని గిల్ రోడ్డు ఏరియాలో ఉన్న గోల్డ్ లోన్ బ్యాంకులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దోచుకెళ్లిన బంగారం విలువ సుమారు 12 కోట్లు ఉంటుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు చోరీ జ‌రిగింది. కేవ‌లం 25 నిమిషాల్లోనే అయిదుగురు దొంగ‌లు ఆ మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. న‌లుగురు వ్య‌క్తులు బ్యాంకులోకి ప్ర‌వేశించ‌గా.. మ‌రొక‌రు కారులో వేచి ఉండి చోరీని ప్లాన్ చేశారు. సీసీటీవీ ఫూటేజ్‌లో నిందితుల్ని గుర్తించారు.  లూథియానా పోలీసులు కేసు న‌మోదు చేశారు. 


logo