శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 16:19:35

‘పది’ టాపర్లకు యూపీ సీఎం యోగి బంపర్‌ ఆఫర్‌

‘పది’ టాపర్లకు యూపీ సీఎం యోగి బంపర్‌ ఆఫర్‌

లక్నో : పరీక్ష ఫలితాల్లో మెరిట్‌ సాధించిన వారికి ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకు గాను ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అరుదైన ప్రకటన చేసింది. పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో టాప్‌ మెరిట్‌ సాధించిన 10 మంది విద్యార్థుల ఇండ్ల వరకు రోడ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన చేసిన మొదటి రాష్ట్రం యూపీనే కావడం విశేషం.

యూపీ డిప్యూటీ మినిస్టర్‌ దినేశ్‌ శర్మ శనివారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పది, ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సూచన ప్రకారం మెరిట్‌ సాధించిన 10 మంది విద్యార్థులకు రూ.లక్ష నగదు, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు రోడ్డు సౌకర్యం లేని విద్యార్థుల ఇంటి వరకు రోడ్లు నిర్మించనున్నా’మని  ప్రకటించారు.

టాప్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి యోగి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘కొవిడ్‌ 19 సంక్షోభంలో కూడా ఇలాంటి ఫలితాలు చూడటం హృదయపూర్వకంగా ఉంది. ఇంటర్‌, పదో తరగతి ఫలితాలు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. జూలై 1 నుంచి విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేయనున్నాం’అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. 


logo