బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:11:54

మరికొన్ని గంటల్లో భారత్‌లోకి రాఫెల్‌

మరికొన్ని గంటల్లో  భారత్‌లోకి రాఫెల్‌

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం  మధ్యాహ్నం  2 గంటలకు భారత్‌కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు   హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగుతాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌  మార్షల్‌  ఆర్‌కేఎస్‌ భదౌరియా విమానాలకు స్వాగతం పలకనున్నారు.  

విమానాల రాక నేపథ్యంలో  వైమానిక దళం స్టేషన్‌కు వెళ్లే రహదారులను సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు.   ఎయిర్‌బేస్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్‌ డ్రోన్లు ఎగరవేయకుండా నిషేధం విధించారు.  వైమానిక స్థావరానికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించినట్లు అధికారి తెలిపారు. ల్యాండింగ్‌ సమయంలో ఇంటిపైకప్పుల నుంచి ఫొటోలు, వీడియోలు తీయడానికి కూడా నిషేధించారు.  రాఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ రాక నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 


logo