సోమవారం 13 జూలై 2020
National - Jun 21, 2020 , 16:05:12

లాక్‌డౌన్‌ లేకున్నా రోడ్లన్నీ ఖాళీ..

లాక్‌డౌన్‌ లేకున్నా రోడ్లన్నీ ఖాళీ..

కొచ్చి : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఆదివారం రోడ్లు, మార్కెట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.  ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరులో భాగంగా విధించిన లాక్‌డౌన్‌కు ఆదివారం మినహాయింపునిచ్చింది. కరోనా నియంత్రణకు ప్రజలు బయటకు వచ్చేప్పుడు మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ సూచించడంతో ప్రతిఒక్కరూ సీఎం సూచనలను తూ.చ.తప్పకుండా పాటిస్తున్నారు. కాగా దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా కొచ్చిలో ఆదివారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. గ్రహణం కారణంగా జనాలు బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. 


logo