శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 13:19:28

ఆర్టీసీ బస్సులకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

ఆర్టీసీ బస్సులకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం యెడియూరప్ప అధికారికంగా ప్రకటించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడుతాయన్నారు. ఆదివారం రోజు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు.

అన్ని దుకాణాలు తెరువబడుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సీఎం యోడియూరప్ప పేర్కొన్నారు. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. 


logo