సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 20:31:54

లక్నో-హర్దోయ్ రోడ్డు ఇక టాండన్ మార్గ్‌

లక్నో-హర్దోయ్ రోడ్డు ఇక టాండన్ మార్గ్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ రోడ్డుకు, చౌరస్తాకు ప్రభుత్వం దివంగత మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ లాల్జీ టాండన్ పేరు పెట్టింది. శనివారం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఆన్‌లైన్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చౌక్ చౌరాహా పేరును లాల్జీ టాండన్ చౌరాహాగా మార్చామని, లక్నో-హర్దోయ్ రోడ్డుకు టాండన్ మార్గంగా నామకరణం చేశామని లక్నో మేయర్ సన్యుక్తభాటియా తెలిపారు. మాజీ ఎంపీ, గవర్నర్ టాండన్ లక్నోలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2020 జులై 21న ఆయన తుదిశ్వాస విడిచారు. లక్నోలోని హజ్రత్ గంజ్ చౌరాహాకు 2018లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మరణానంతరం పేరు మార్చారు.


logo