శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 13:23:38

రోడ్డుప్రమాద మరణాలు ఆ రెండు నగరాల్లోనే ఎక్కువట.!

రోడ్డుప్రమాద మరణాలు ఆ రెండు నగరాల్లోనే ఎక్కువట.!

న్యూఢిల్లీ : ఢిల్లీ తరువాత 2019లో మిలియన్‌ ప్లస్‌ నగరాల్లో అత్యధిక రోడ్డు మరణాలు సంభవించే నగరంగా జైపూర్‌ రెండోస్థానంలో నిలిచింది.  అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో 227 తక్కువ మరణాలు సంభవించినా గరిష్ట మరణాలున్ననగరంగా పింక్‌సిటీ మిగిలింది. 2018లో జైపూర్‌ ఈ జాబితాలో నాలుగోస్థానంలో ఉంది. రాష్ట్రాలవారిగా చూస్తే ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2019లో ఆ రాష్ట్రంలో 22,655 మంది రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 12,788 మరణాలతో ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్ర కొనసాగుతుండగా మధ్యప్రదేశ్‌ మూడోస్థానంలో ఉంది.

అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలిస్తే గడిచిన ఐదేళ్లలో తమిళనాడులో మరణాల సంఖ్య 33 శాతానికి (2015లో 15,642 మంది మరణించడగా 2019 నాటికి 10,525) తగ్గిందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్నిరాష్ట్రాలు ప్రమాదాల నివారణకు తమిళనాడు నమూనాను అనుసరించాలని, పాటిస్తున్న జాగ్రత్తను లోతుగా విశ్లేషించాలని కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఢిల్లీలో 2019లో 1,463 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించగా జైపూర్‌లో 1,283, చెన్నై 1,252 సంభవించాయి. 447 మరణాలతో ముంబై జాబితాలో 11వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 2019లో 1.51 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది గతేడాదితో పోలిస్తే 0.2 శాతం తక్కువ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.