ఆదివారం 17 జనవరి 2021
National - Dec 02, 2020 , 08:48:23

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

అమరావతి : కర్నూలు జిల్లా గూడురు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ - బైక్‌ ఢీకొట్టున్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గూడూరు సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్,  మోటర్ బైక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను సీ బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి వాసులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.