ఆదివారం 24 మే 2020
National - Feb 20, 2020 , 08:55:05

టూరిస్టు బస్సు - టెంపో వాహనం ఢీ : ఆరుగురు మృతి

టూరిస్టు బస్సు - టెంపో వాహనం ఢీ : ఆరుగురు మృతి

తమిళనాడు : సేలం జిల్లా ఓమలూరులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టు బస్సు - టెంపో వాహనం ఢీకొని ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సేలం ఆస్పత్రికి తరలించారు. మృతులను నేపాల్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా తీర్థయాత్ర కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

తమిళనాడులోని తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద కూడా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఘోర ప్రమాదం సంభవించింది. కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. కేరళ ఆర్టీసీ బస్సు తిరుప్పూర్‌ నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరప్పూర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో కంటైనర్‌ క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 


logo