శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 19:57:07

ఆర్జేడీ కూటమికి.. ఆర్‌ఎల్‌ఎస్పీ గుడ్‌ బై!

ఆర్జేడీ కూటమికి.. ఆర్‌ఎల్‌ఎస్పీ గుడ్‌ బై!

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి గుడ్‌ బై చెప్పాలని ఆర్‌ఎల్‌ఎస్పీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ ఆధ్వర్యంలో గురువారం సమావేశం జరిగింది. ఆర్జేడీ నేతృత్వంలో మార్పు సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సీట్ల పంపకం కన్నా బీహార్‌ అభివృద్ధే తమకు ముఖ్యమని ఉపేంద్ర చెప్పారు. ప్రజలంతా సీఎం నితీశ్‌ కుమార్ మాదిరి నాయకత్వం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలో పరిస్థితిపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోమని పార్టీ తనను కోరిందని ఉపేంద్ర కుష్వాహ తెలిపారు. బీహార్‌ ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. దీంతో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిని ఆర్‌ఎల్‌ఎస్పీ వీడవచ్చని తెలుస్తున్నది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి