శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 11:58:28

తేజ‌శ్వి యాద‌వ్‌కు లైవ్ ఫిష్ గిప్ట్‌

తేజ‌శ్వి యాద‌వ్‌కు లైవ్ ఫిష్ గిప్ట్‌

పాట్నా : బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్ కౌంటింగ్ కొన‌సాగుతుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. ఒక‌వైపు కౌంటింగ్ కొన‌సాగుతుండ‌గా త‌మ నేత తేజ‌శ్వి యాద‌వ్‌కు అదృష్టం క‌లిసిరావాల్సిందిగా కోరుతూ ఆర్జేడీ మ‌ద్ద‌తుదారులు ఆయ‌న‌కు బ్ర‌తికిఉన్న చేప‌ల‌ను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని గ్రాండ్ అలయన్స్ అధిక స్థానాల్లో గెలుపొంద‌నున్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా అంచనా వేసిన నేప‌థ్యంలో మద్దతుదారులు, శ్రేయోభిలాషులు 31 ఏళ్ల సీఎం అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో భాగంగానే త‌మ నేత‌ను అదృష్టం వ‌రించాల్సిందిగా కోరుతూ కొంతమంది మద్దతుదారులు లైఫ్ ఫిష్‌ను ఆయ‌న నివాసానికి తీసుకువ‌చ్చారు. చేపలను తీసుకువచ్చిన సమస్తిపూర్ జిల్లాకు చెందిన ఆర్జేడీ మద్దతుదారుడు మీడియాతో మాట్లాడుతూ.. చేపలు మంచి అదృష్టాన్ని తెస్తాయ‌న్నారు. తేజశ్వి చేప‌ల‌ను ప‌రిశీలిస్తే చాలు తన అదృష్టం మారుతుందన్నారు. 2015లో సైతం ఇదేర‌కంగా చేప‌ల‌ను బ‌హుమ‌తిగా అంద‌జేసినప్పుడు అదృష్టం వ‌రించింద‌న్నారు.