మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 13:40:14

ఫ‌లితాల వేళ కాల్పులు వ‌ద్దు : ‌తేజ‌స్వి యాద‌వ్‌

ఫ‌లితాల వేళ కాల్పులు వ‌ద్దు : ‌తేజ‌స్వి యాద‌వ్‌

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని, ఎవ‌రూ కూడా గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌కూడ‌ద‌ని ఆదేశించారు. ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా అంగీక‌రించాల‌న్నారు. ఇత‌ర పార్టీల ప‌ట్ల మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాల‌ని సూచించారు. 

ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ సోమ‌వారం త‌న 32వ‌ బ‌ర్త్‌డే సెలబ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌ల్లో అత‌ని కుటుంబ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.