బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 13:18:57

కుటుంబ‌స‌భ్యుల న‌డుమ తేజ‌స్వియాద‌వ్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు

కుటుంబ‌స‌భ్యుల న‌డుమ తేజ‌స్వియాద‌వ్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు

ప‌ట్నా: ఆర్జేడీ అగ్ర నాయ‌కుడు, ఆ పార్టీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చిన్న కుమారుడు తేజ‌స్వియాద‌వ్ త‌న పుట్టినరోజు వేడుక‌ల‌ను కుటుంబ‌స‌భ్యుల మధ్య ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తేజ‌స్వి సోద‌రుడు తేజ్‌ప్ర‌తాప్ యాద‌వ్‌, త‌ల్లి ర‌బ్రీదేవి, అక్కాచెల్లెల్లు, బావ‌లు, వారి పిల్ల‌లతోపాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులంతా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. పుట్టిన‌రోజు వేడుక కోసం ఇంటిని రంగురంగుల దీపాలు, పూల‌తో క‌లర్‌ఫుల్‌గా అలంక‌రించారు. తేజ‌స్వియాద‌వ్ కేక్ క‌ట్‌చేసి ముందుగా త‌న త‌ల్లి ర‌బ్రీదేవికి తినిపించగా.. అనంత‌రం ర‌బ్రీదేవి తేజ‌స్వికి కేక్ తినిపించింది. ఆ త‌ర్వాత కుటుంబ‌స‌భ్యులంతా వ‌రుస‌బెట్టి తేజ‌స్వికి కేక్ తినిపిస్తూ జ‌న్మ‌దిన శుభాకాంక్షులు తెలియ‌జేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.