గురువారం 21 జనవరి 2021
National - Dec 04, 2020 , 13:16:14

షో చేయ‌డానికే ఆల్‌పార్టీ మీటింగ్‌.. కేంద్రంపై తేజ‌స్వి ఫైర్

షో చేయ‌డానికే ఆల్‌పార్టీ మీటింగ్‌.. కేంద్రంపై తేజ‌స్వి ఫైర్

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై బీహార్‌కు చెందిన యువ నాయ‌కుడు, ఆర్జేడీ కీల‌క నేత తేజస్వి యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై స‌మీక్ష చేయ‌డం కోసం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఆ మీటింగ్‌కు త‌మ పార్టీని ఆహ్వానించక‌పోవ‌డంపై మండిప‌డ్డారు. 

బీహార్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన ఆర్జేడీని అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ఆహ్వానించ‌క‌పోవ‌డం కేంద్ర ప్ర‌భుత్వ ప‌క్ష‌పాతపూరిత వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని తేజ‌స్వి యాద‌వ్ విమ‌ర్శించారు. న‌చ్చిన వాళ్ల‌ని పిలుచుకుని, తూతూమంత్రంగా ముగించిన‌ ఈ స‌మావేశం.. క‌రోనా నిర్మూల‌న కోసం చిత్త‌శుద్ధితో ‌నిర్వ‌హించిన స‌మావేశంలా లేద‌ని, ఏదో షో చేయ‌డం కోసం నిర్వ‌హించిన స‌మావేశంలా ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo