మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 01:38:47

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 22 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. గత కొద్దికాలంగా కరోనా ఉద్ధృతి కొనసాగినా కూడా చమురు బాదుడును మాత్రం ఆయిల్‌ కంపెనీలు ఆపలేదు. ఒకానొక దశలో వరుసగా ధరలను పెంచాయి. మళ్లీ తాజాగా శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 22 పైసలను పెంచాయి.

పెరిగిన రేట్ల ప్రకారం ప్రధాన నగరాల్లో ధరలు

నగరం
పెట్రోల్‌ ధర(లీటరుకు)
డీజిల్‌ ధర(లీటరుకు)
హైదరాబాద్‌
84.47
72.12
ఢిల్లీ
81.23
70.68
ముంబై
87.92
77.11
చెన్నై
84.31
76.17
కోల్‌కతా
82.79
74.24