సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 17:02:54

కరోనా ఎఫెక్ట్‌ : శ్రీనగర్‌లో లాక్‌డౌన్‌

కరోనా ఎఫెక్ట్‌ : శ్రీనగర్‌లో లాక్‌డౌన్‌

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో కరోనా విజృంభిస్తుండడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో అధికారులు ఆదివారం లాక్‌డౌన్‌ విధించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నగరవాసులంతా స్వాగతించారు. ‘గతంలో కరోనా ప్రభావం తగ్గిందని ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా మరోసారి కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ సులువైన మార్గమని భావించింది’ అని స్థానికుడొకరు అభిప్రాయపడ్డారు.

కరోనా నియంత్రణకు ప్రజలంతా  ప్రభుత్వ పామాణిక నియయమాలను తప్పనిసరిగా పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కొని, ముఖానికి మాస్కులు ధరించాలి. కరోనాకు మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం’ అని మరొకరు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 13,198 కరోనా కేసులు నమోదయ్యాయి. 7615 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి కాగా 236 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.logo