మంగళవారం 26 జనవరి 2021
National - Nov 27, 2020 , 07:23:12

మారడోనాకు బదులు మడోనాకు నివాళులు

మారడోనాకు బదులు మడోనాకు నివాళులు

న్యూఢిల్లీ: ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు.. ఫుట్‌బాల్‌ లెజండ్‌ మారడోనా మృతితో కాస్తా పాప్‌ సింగర్‌ మడోనాకు నివాళులు అర్పించేవరకు వెళ్లింది. అవును.. మడోనాకు నివాళులర్పిస్తూ చేసిన ఆర్‌ఐపీ పోస్టులు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అయ్యాయి. మారడోనా, మడోనా.. ఒకరు ఫుట్‌బాల్‌ను విశ్వవ్యాప్తం చేస్తే, మరొకరు తన పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. అయితే పేరులో కొంచమే తేడా ఉండటంతో మరణవార్త విని షాక్‌ గురైన అభిమానులు మారడోనాను కాస్తా మడోనాగా మార్చారు. వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా ఫుట్‌బాల్‌ అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే కొందరు మారడోనాను పొరబాటున పాప్‌సింగర్‌ మడోనా అనుకున్నారు. ఆమె మరణించిందనుకొని ఆమెకు నివాళులర్పిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. అవికాస్తా ట్రెండింగ్‌ అయ్యాయి. 


logo