సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 12:27:26

మ‌నిషి లేకుండానే న‌డిరోడ్డు మీద రౌండ్లు కొడుతున్న బైక్‌!

మ‌నిషి లేకుండానే న‌డిరోడ్డు మీద రౌండ్లు కొడుతున్న బైక్‌!

బైక్ మీద కూర్చున్న‌ప్పుడు ప్ర‌దేశం కాస్త విశాలంగా ఉంటే చాలు రౌండ్లు కొడుతుంటారు. ర‌య్ ర‌య్ మంటూ స‌ర్కిల్ ఆకారంలో చ‌క్క‌ర్లు కొడుతుంటారు. ఇది మ‌నుషులు హ్యాండిల్ చేస్తేనే బైక్ తిరుగుతుంది. ఇక్క‌డ మాత్రం బైక్ తానంత‌ట తానే రౌండ్లు కొడుతుంది. ఈ మాత్రం దానికి మ‌నిషి ఎందుకులే అనుకున్న‌దో ఏమో. ఒక‌టే ఇలా గిర గిరా తిరుగుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

స‌ర‌దా ప‌డి ఈ బైక్ స్టంట్స్ వేయ‌లేదు. దీని మీద వ‌స్తున్న వ్య‌క్తి రోడ్డు ప్ర‌మాదంలో ఎక్క‌డో రోడ్డుకు అవ‌త‌ల ప‌డ్డాడు. కానీ బైక్ మాత్రం ఇలా తిరుగుతూనే ఉన్న‌ది. ఈ సంఘ‌ట‌న‌ను కొంత‌మంది వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో చివ‌ర్లో బైక్ య‌జ‌మాని దాని వ‌ద్ద‌కు వ‌చ్చి తీసుకెళ్తున్న‌ట్లు క‌నిపించాడు. మ‌రి ఈ వీడియోను ఒక‌సారి మీరు కూడా చూసేయండి. 


logo