ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 18:49:46

అస్సాంలో వరదలు.. రోడ్డుపైకి ఖడ్గ మృగం..

అస్సాంలో వరదలు.. రోడ్డుపైకి ఖడ్గ మృగం..

నాగాన్ : అస్సా రాష్ట్రంలో వరదలు విలయం సృష్టించాయి. వేల మంది నిరాశ్రయులుగా మిగలగా పశుపక్ష్యాదులు అదేస్థాయిలో మృతి చెందాయి. గోలఘాట్‌లోని కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో 96 జంతువులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శనివారం ఉద్యానవనం నుంచి ఓ ఖడ్గమృగం బాగోరి అటవీ రేంజ్‌ పరిధిలోని బందర్ ధుబీ ప్రాంత సమీపంలో జాతీయ రహదారి-37పైకి చేరి విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది.

ఖడ్గమృగ్గాన్ని పార్కులోకి పంపేందుకు సిబ్బందితో కలిసి పార్క్ డైరెక్టర్ శివకుమార్ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. పార్కు సిబ్బంది, నాగాన్ పోలీసులు ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ వాహనదారులను నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఖడ్గమృగం బలహీనంగా ఉందని, పశువైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగైన తరువాత రెస్క్యూ కేంద్రానికి తరలిస్తామని పార్కు సిబ్బంది పేర్కొన్నారు.logo