శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 18:18:56

రియా సోద‌రుడి ద్వారా సుశాంత్‌కు డ్ర‌గ్స్‌: ఎన్‌సీబీ

రియా సోద‌రుడి ద్వారా సుశాంత్‌కు డ్ర‌గ్స్‌: ఎన్‌సీబీ

ముంబై: ‌బాలీవుడ్ న‌టి రియా చ‌క్రవ‌ర్తి త‌న సోద‌రుడు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి సాయంతో త‌ర‌చూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసేవార‌ని, త‌మ ద‌ర్యాప్తులో తాజాగా ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు తెలిపారు. సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో డ్ర‌గ్స్ కోణం, బాలీవుడ్‌కు డ్ర‌గ్స్ ముఠాల‌కు మ‌ధ్య సంబంధాల‌పై ఎన్‌సీబీ ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ది. ద‌ర్యాప్తులో భాగంగా డ్ర‌గ్స్ ముఠాకు చెందిన‌ స‌భ్యుడు బాసిత్ ప‌రిహార్‌ను విచారించ‌గా.. శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి పేరు వెలుగులోకి వ‌చ్చింది. 

రియా సోద‌రుడు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తికి తాను త‌ర‌చుగా బ‌డ్‌ను (క్యూరేటెడ్ స్థితిలో ఉన్న మారిజువానాను) స‌మ‌కూర్చేవాడినని బాంద్రా ఏరియాకు చెందిన డ్ర‌గ్ పెడ్ల‌ర్‌ బాసిత్ ప‌రిహార్ చెప్పిన‌ట్లు ఎన్‌సీబీ అధికారులు వెల్ల‌డించారు. శోవిక్ చ‌క్రవ‌ర్తి కూడా ఈ విష‌యాన్ని అంగీక‌రించాడని, బాసిత్ ప‌రిహార్‌, కైజాన్ ఇబ్ర‌హీం అనే ఇద్ద‌రు డ్ర‌గ్ పెడ్ల‌ర్‌ల‌ నుంచి త‌ర‌చుగా డ్ర‌గ్స్ తీసుకెళ్లి త‌న సోద‌రికి ఇచ్చేవాడ‌ని, ఆమె సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు ఆ డ్ర‌గ్స్ అంద‌జేసేవార‌ని  ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. కేసు ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని చెప్పారు.  ‌  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.