గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 09, 2020 , 02:34:57

రియా అరెస్ట్‌

రియా అరెస్ట్‌

  • సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కీలక మలుపు 
  • ఈ నెల 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ 

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌కు మాదకద్రవ్యాలు అందజేయటం, డ్రగ్స్‌ సరఫరాదార్లతో సంబంధాలు కలిగి ఉండటం అన్న అభియోగాలతో సుశాం త్‌ స్నేహితురాలు, టీవీ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎన్‌సీబీ) మంగళవారం అరెస్టు చేసింది. ఇవే ఆరోపణలపై రియా సోదరుడు షోయిక్‌ చక్రవర్తిని, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాను ఇప్పటికే అరెస్టు చేశారు. రియాకు కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. 

టీ షర్ట్‌తో రియా సందేశం 

సుశాంత్‌ కేసులో కీలకంగా మారిన రియా చక్రవర్తి మంగళవారం ఎన్‌సీబీ ఆఫీసుకు వచ్చిన సమయంలో ధరించిన టీ షర్ట్‌పై ముద్రించి ఉన్న అక్షరాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘గులాబీ ఎరుపు.. ఉదా నీలం.. పితృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేద్దాం పదండి.. మీకోసం.. నాకోసం’ అని ఆమె టీ షర్ట్‌పై ఉంది.