మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 18:33:20

అగ్రి బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్షాలు

అగ్రి బిల్లులను వెనక్కి పంపండి.. రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరినట్లు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఆయనకు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబి ఆజాద్‌ తెలిపారు. ప్రతిపక్షాల తరుఫున రాష్ట్రపతి కోవింద్‌ను బుధవారం ఆయన కలిశారు. అనంతరం ప్రతిపక్ష నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.


డివిజన్‌, వాయిస్‌ ఓటింగ్ లేకుండా అగ్రి బిల్లులను రాజ్యసభలో ఆమోదించారని ఆజాద్‌ ఆరోపించారు. పవిత్ర ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అణగదొక్కిందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులను తిరిగి పంపాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆజాద్‌ తెలిపారు. ఈ మేరకు ప్రతిపక్షాల తరుఫున వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన చెప్పారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo