మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 02:41:11

‘నైరుతి’ తిరోగమనం

‘నైరుతి’ తిరోగమనం

  • పంజాబ్‌, పశ్చిమ రాజస్థాన్‌ నుంచి తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు
  • రాష్ట్రంలో నైరుతి ఉపసంహరణపై ముందస్తు అంచనా అక్టోబర్‌ 15 
  • 11 రోజుల ఆలస్యంగా ప్రక్రియ

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల తిరోగమనం సోమవారం ప్రారంభమైంది. పంజాబ్‌, రాజస్థాన్‌ పశ్చిమ ప్రాంతం నుంచి ఇవి తిరుగుముఖం పట్టాయి. రానున్న రెండు, మూడ్రోజుల్లో హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని మిగతా ప్రాంతాల నుంచి కూడా రుతుపవనాలు వెనక్కి మళ్లుతాయని భారత వాతావరణ విభాగం  సోమవారం తెలిపింది. ఈ నెల 17 నుంచి పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంతంలో రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని భావించామని, కానీ 11 రోజుల ఆలస్యంగా సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. తిరోగమనంతో తమిళనాడుతోపాటు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వివరించింది.  ముందస్తు అంచనా ప్రకారం తెలంగాణలో అక్టోబర్‌ 15 కల్లా నైరుతి తిరోగమించాల్సి ఉన్నది.


logo