బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 14:32:55

ఆర్మీ జ‌వాన్ల రిటైర్మెంట్ వ‌య‌సు పెంపు !

ఆర్మీ జ‌వాన్ల రిటైర్మెంట్ వ‌య‌సు పెంపు !


హైద‌రాబాద్‌: సైన్యంలో ప‌నిచేస్తున్న జ‌వాన్ల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సును పెంచ‌నున్న‌ట్లు జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఆయ‌న ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆర్మీలో జ‌వాన్ల‌తో పాటు వైమానిక ద‌ళంలో ఎయిర్‌మెన్‌, నేవీలో సెయిల‌ర్ల రిటైర్మెంట్ వ‌య‌సును కూడా పెంచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్రివిధ ద‌ళాల్లో ఉన్న జ‌వాన్ల రిటైర్మెంట్ వ‌య‌సు పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకున్న‌ట్లు రానున్న‌ట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. ఈ విధానం వ‌ల్ల త్రివిధ ద‌ళాల్లోని సుమారు 15 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. జ‌వాన్లు కేవ‌లం 15 లేదా 17 ఏళ్లు ఎందుకే స‌ర్వీస్‌లో ఉండాలి, వారెందుకు 30 ఏళ్ల సేవ చేయ‌కూడ‌ద‌ని బిపిన్ రావ‌త్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  శిక్ష‌ణ పొందిన వ్య‌క్తుల్ని తొంద‌ర‌గా కోల్పోకూడ‌ద‌న్నారు.    


logo