గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 14:38:46

కొడుకు హత్య కేసు..రిటైర్డ్ పోలీస్ అధికారి అరెస్ట్‌

కొడుకు హత్య కేసు..రిటైర్డ్ పోలీస్ అధికారి అరెస్ట్‌

ముంబై: కుమారుడిని హత్య చేసిన ఘటనలో రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే..సబర్బన్‌ పొవారీలోని గణేశ్‌ నగర్‌ ప్రాంతంలో గులాబ్‌ గలాండే (రిటైర్డ్‌ కానిస్టేబుల్‌)తన కొడుకు హరీశ్‌ (40)తో కలిసి నివసిస్తున్నాడు. హరీశ్‌ అంధేరీలో జీఆర్‌పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే హరీశ్‌ తరచూ తాగి వచ్చి..భార్య పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని హరీశ్‌ను గులాబ్‌ గలాండే  మందిలించేవాడు.

ఇటీవలే తాగుడు విషయంలో ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో..హరీశ్‌పై గులాబ్‌ గలాండే కొడవలితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న హరీశ్‌ ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తండ్రి  గులాబ్‌ గలాండేను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


logo