బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:49:39

ఊసరవెళ్లి గుడ్లు పెడుతుండగా క్లిక్‌మనిపించాడు!

ఊసరవెళ్లి గుడ్లు పెడుతుండగా క్లిక్‌మనిపించాడు!

చెన్నై: ఊసరవెళ్లి రంగులు మార్చడం చూశాం. కానీ దాన్ని ఫొటోలో బంధించడం ఇప్పటికీ  కష్టసాధ్యమైన పనే. అలాగే, అది గుడ్లు పెడుతుండగా చూశారా?. కానీ ఒకతను చూడడంతోపాటు తన కెమెరాతో ఈ దృశ్యాన్ని క్లిక్‌మనిపించాడు. 

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం తంబారానికి చెందిన శ్రీనివాసన్‌ రేమ్స్‌ నేవీ రిటైర్డ్‌ కమాండర్‌. శనివారం తన తోటలో విహరిస్తుండగా ఊసరవెళ్లి గుడ్లు పెడుతున్న అరుదైన దృశ్యం కనిపించింది. వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్‌తో అతడు ఈ దృశ్యాన్ని ఒడిసిపట్టాడు. ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉన్న ఊసరవెళ్లి ఓ చిన్న రంధ్రంలో గుడ్లు పెడుతుండగా అతడు తీసిన చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఫొటోను చూసి, అందరూ అబ్బురపడుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo