శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 07:39:23

రెస్టారెంట్లు, బార్లు, ప‌బ్బుల‌కు అనుమ‌తి

రెస్టారెంట్లు, బార్లు, ప‌బ్బుల‌కు అనుమ‌తి

బెంగ‌ళూరు : లాక్ డౌన్ ప్ర‌భావంతో ఆదాయం ప‌డిపోవ‌డంతో.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఇటీవ‌లే కొన్ని స‌డ‌లింపుల‌తో మ‌ద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వం తాజాగా రెస్టారెంట్లు బార్లు, ప‌బ్బుల‌కు మ‌ద్యం అమ్మేందుకు అనుమ‌తించింది.

మే 9 నుంచి 17 వ‌ర‌కు మ‌ద్యాన్ని రిటైల్ ధ‌ర‌ల‌కు అమ్ముకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 753 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..346 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 376 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo