బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 21:25:51

రాజస్థాన్‌లో రెస్టారెంట్లు, సెలూన్‌లకు అనుమతి

రాజస్థాన్‌లో రెస్టారెంట్లు, సెలూన్‌లకు అనుమతి

జైపూర్‌: నాలుగో విడత లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రీన్‌ జోన్లలో రెస్టారెంట్లు, సెలూన్‌లకు అనుమతి ఇస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సామాజిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం అనే నిబంధనలకు కచ్చితంగా పాటించాలని సూచించింది. అదేవిధంగా కంటైన్‌మెంట్‌ ఏరియాలు మినహా ఆరెంజ్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో కూడా రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్‌ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆయా షాపుల నుంచి కేవలం డోర్‌ డెలివరీలకు మాత్రమే అనుమతి ఉంటుందని రాజస్థాన్‌ ప్రభుత్వం స్సష్టం చేసింది. అదేవిధంగా షాపులోనైనా మాస్కులు ధరించని వినియోగదారులకు ఉత్పత్తులను అమ్మవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అదేవిధంగా వివాహాలు తదితర శుభకార్యాలకు తప్పనిసరిగా సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి లేదని రాజస్థాన్‌ సర్కారు పేర్కొన్నది. అదేవిధంగా గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ ఇలా ఏ జోన్లోనైనా 65 ఏండ్లకు పైబడిన వారు, 10 ఏండ్ల వయసు మించని వారు బయటకు రావద్దని సూచించింది.


logo