శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 18:57:46

పంజాబ్‌లో నేటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లకు అనుమతి: సీఎం అమరీందర్‌సింగ్‌

పంజాబ్‌లో నేటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లకు అనుమతి: సీఎం అమరీందర్‌సింగ్‌

ఛండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో మూతపడ్డ రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లభించింది. 50 శాతం సామర్థ్యంతో వీటిని నడుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ మంగళవారం ప్రకటించారు. అయితే, సర్కారు పేర్కొన్న ప్రామాణిక నిర్వహణా పద్ధతులను తప్పకుండా పాటించాలని నిర్వాహకులకు ఆదేశించారు. 

కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రెస్టారెంట్లలో 50 మంది వ్యక్తులు లేదా 50 మంది అతిథులకు రాత్రి ఎనిమిది గంటల వరకు డైనింగ్‌ సేవలు అందించవచ్చు.  అలాగే, బార్లు తెరిచేందుకు అనుమతి లేదు. కానీ రెస్టారెంట్లలో ఎక్సైజ్‌ పాలసీకి అనుగుణంగా రూంలలో మాత్రమే లిక్కర్ ను సర్వ్‌ చేయవచ్చు. ఫంక్షన్‌హాల్స్‌లో‌ కేవలం 50 మంది సమక్షంలోనే పెళ్లిళ్లు నిర్వహించుకోవచ్చు. క్యాటరింగ్‌ స్టాఫ్‌ సంఖ్యను ఇందులో కలపరు. కాగా, లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత ఈ నెల 6న అమరీందర్‌సింగ్‌ గుడులు, మాల్స్‌ తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లకు కూడా అనుమతిచ్చారు. కానీ లోపల భోజనం వడ్డించడంపై ఆంక్షలు విధించారు. logo