మంగళవారం 31 మార్చి 2020
National - Feb 11, 2020 , 14:03:41

ఓటర్ల తీర్పును గౌరవిస్తాం: ఆల్కా లంబా

ఓటర్ల తీర్పును గౌరవిస్తాం: ఆల్కా లంబా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓటర్ల తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆల్కా లంబా అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మతాలకు అనుగుణంగా జరిగాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని విజయం వరించిందని ఆమె తెలిపారు. చాందినిచౌక్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆల్కాలంబా.. ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఫలితాన్ని స్వాగతిస్తున్నానని.. కానీ ఎప్పటికీ వదులుకోనని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న ప్రధాన లక్ష్యం.. విపరీతమైన సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజల పక్షాన పోరాడడమేనని తెలిపారు. ఈ రోజు పోరాడితే రేపటి విజయం నీదేనని ఆమె అన్నారు. 

ప్రస్తుతం.. లంబా 1,229 ఓట్ల వెనుకంజలో మూడో స్థానంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి పర్లాద్‌ సింగ్‌ సాహ్ని.. బీజేపీ అభ్యర్థి సుమన్‌ కుమార్‌ గుప్తాపై 23,281 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

2015 ఎన్నికల్లో లంబా ఆప్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో విభేదాల కారణంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయబడ్డారు. అనంతరం లంబా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆప్‌ 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 43 స్థానాల్లో గెలుపొందగా.. 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 స్థానాల్లో గెలిచి, మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఒక్క నియోజకవర్గంలోనూ ఆధిక్యత కనబరచడం లేదు. logo
>>>>>>