మంగళవారం 02 జూన్ 2020
National - Jan 28, 2020 , 15:04:59

శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ప్రభుత్వం

శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపిన  ప్రభుత్వం

శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

అమరావతి:  ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వం  కేంద్రానికి పంపింది. మండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మండలి రద్దు తీర్మానం ప్రతితో పాటు ఓటింగ్‌ అంశాలను  శాసనసభ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని, మండలి రద్దు ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం తాజాగా  కేంద్రానికి పంపింది. ఏపీ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ, ఎన్నికల సంఘానికి ఏపీ సర్కార్‌ పంపించింది. కేబినెట్‌లో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం బిల్లుపెట్టనుంది. 


logo