గురువారం 26 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 14:11:33

‘రిజర్వేషన్లు జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలి’

‘రిజర్వేషన్లు జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలి’

వాల్మీకినగర్‌ :  రిజర్వేషన్లు జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ అన్నారు. గురువారం సాయంత్రం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.  ‘జనాభా ఎంతన్నది లెక్కల తరువాత మాత్రమే నిర్ధారించబడుతుంది. జనాభాను నిర్ణయించేది మనం కాదు. రిజర్వేషన్లు జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలి. దీని గురించి రెండో అభిప్రాయం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. 

గతంలోనే సేవ చేసేందుకు అవకాశం కల్పించిన విధంగానే ప్రజలు భవిష్యత్‌లోనూ అవకాశం కల్పిస్తే తాము పనిచేస్తూ వెళ్తామని నితీశ్‌ అన్నారు. ప్రధాని దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, బీహార్‌ అభివృద్ధికి ప్రత్యేక సాయం అందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తొలివిడుతలో ఆరు జిల్లాలోని 71 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో  55.69 శాతం పోలింగ్ నమోదైందని, 2015తో పోలిస్తే కాస్త మెరుగ్గానే పోలింగ్‌ శాతం నమోదైందని ఆయన వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.